రైలు దిగాక నేరుగా ఇంటికెళ్లొచ్చు

12 May, 2020 18:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నేటి నుంచి పరిమిత మార్గాల్లో రైళ్ల రాక‌పోక‌లు న‌డుస్తున్నందున ఢిల్లీ ప్ర‌భుత్వం కొత్త మార్గ‌ద‌ర్శకాలు విడుద‌ల చేసింది. రైళ్ల ద్వారా రాజ‌ధానికి చేరుకుంటున్న వారికి క్వారంటైన్ త‌ప్ప‌నిస‌రి కాద‌ని వెల్ల‌డించింది. క‌రోనా ల‌క్ష‌ణాలు లేనివారికే ఈ వెసులుబాటు ఉంటుంద‌‌ని స్ప‌ష్టం చేసింది. వారికి క్వారంటైన్ కాకుండా నేరుగా ఇంటికి వెళ్లేందుకు అనుమ‌తిస్తున్నామ‌ని తెలిపింది. అయితే కొద్దిపాటి ల‌క్ష‌ణాలు క‌నిపించినా వారికి మాత్రం క్వారంటైన్ త‌ప్పనిస‌రని పేర్కొంది. వీరికి వైద్య పరీక్ష‌లు నిర్వ‌హించిన అనంత‌రం ఫ‌లితాల ఆధారంగా సెల్ఫ్ ఐసోలేష‌న్‌ లేదా గృహ నిర్బంధంలో ఉండాల‌ని ఆదేశించింది. ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌యాణికుల‌ను ప‌రీక్షించేందుకు రైల్వే స్టేష‌న్ల‌లో ఎక్కువ సంఖ్య‌లో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాల‌ని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక ఈ కింది విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని తెలిపింది. (70 వేలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య)

మ‌రిన్ని మార్గదర్శకాలివీ...
ప్ర‌యాణికులు ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ప్ర‌యాణికులు ఎక్క‌డానిక‌న్నా ముందు రైలును శానిటైజేష‌న్ చేయాలి
క‌రోనా ల‌క్ష‌ణాలు లేనివారినే ప్ర‌యాణానికి అనుమ‌తించాలి
రైల్వే స్టేష‌న్‌లో సామాజిక దూరం త‌ప్ప‌నిస‌రిగా పాటించాలి
ప్ర‌యాణికుల సంఖ్యకు అనుగుణంగా స్క్రీనింగ్ కౌంట‌ర్ల‌ను ఏర్పాటు చేయాలి. వారి వెంట తెచ్చుకునే వ‌స్తువులను కూడా స్క్రీనింగ్ చేయాలి. (లాక్‌డౌన్‌: కేజ్రీవాల్‌ వినూత్న నిర్ణయం)
(రైలు బండి.. షరతులు ఇవేనండీ)

మరిన్ని వార్తలు