మధుమేహంలో మనది రెండోస్థానం!

28 Apr, 2016 14:03 IST|Sakshi
మధుమేహంలో మనది రెండోస్థానం!

భారత దేశంలో మధుమేహం వేగంగా వ్యాప్తి చెందుతోందని, గతేడాది ఏడు కోట్ల వరకూ కేసులు నమోదయ్యాయని ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ లెక్కలు చెప్తున్నాయి. ప్రపంచంలోనే మొదటి మూడు దేశాల్లో ఇండియా రెండో స్థానంలో ఉన్నట్లు నివేదికలు వివరిస్తున్నాయి.

ఇండియాలో మధుమేహం సూపర్ ఫాస్ట్ గా పెరిగిపోతోందని  ఐడీఎఫ్ లెక్కలను బట్టి తెలుస్తోంది. 20 నుంచి 70 ఏళ్ళ మధ్య వయసు కలిగిన వారు ఈ జాబితాలో ఉన్నట్లు అంచనాలు చెప్తున్నాయి. 2014 లో  6.68 కోట్ల మంది ఉండగా, 2015 నాటికి మరో 6.91 కోట్లు పెరిగినట్లు ఆరోగ్య మంత్రి జె పి నడ్డా రాజ్యసభలో వెల్లడించారు. భారతదేశం ప్రపంచంలోని అధిక డయాబెటిస్ కలిగిన  మొదటి మూడు దేశాల్లో  రెండోస్థానంలో ఉన్నట్లు వైద్య పత్రిక ది లాన్సెట్ నివేదికల ద్వారా  తెలుస్తోంది.

మధుమేహంలో రెండవ అత్యధిక స్థానంలో ఉండే చైనాను తాజాగా ఇండియా అధిగమించినట్లు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అధ్యయనాల ఆధారంగా తెలుస్తోందని.. నడ్డా తెలిపారు. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్.. డయాబెటిస్ అట్లాస్.. ఏడవ ఎడిషన్ ప్రకారం చైనా  109.6 మిలియన్ల మధుమేహ రోగులతో అత్యధిక స్థానంలో ఉంది. 61.1 మలియన్ ప్రజలతో భారత్ ఉండగా, అమెరికా మాత్రం 29.3 మిలియన్లుగా నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం క్యాన్నర్, డయాబెటిస్, కార్డియోవాస్క్యులర్ వ్యాధుల నింత్రణకు ప్రత్యేక కార్యక్రమాన్ని జిల్లా స్థాయి వరకూ అమలు చేసే ప్రయత్నంలో ఉన్నామని ఆరోగ్య మంత్రి తెలిపారు. ఆధునిక జీవన శైలిలో మార్పులు, రోగ నిర్థారణ, అధిక సౌకర్యాల నిర్వహణ వంటి వాటిపై దృష్టి సారించి ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నంలో ఉన్నట్లు చెప్పారు.

>
మరిన్ని వార్తలు