చిప్‌లేని కార్డులకు ఇక చెల్లు

16 Dec, 2018 11:26 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

స్పష్టం చేసిన ఆర్‌బీఐ

కొత్త కార్డులు జారీ చేస్తున్న బ్యాంకులు 

కడెం(ఖానాపూర్‌): ‘ఈఎంవీ’ చిప్‌ లేని ఏటీఎం డెబిట్, క్రెడిట్‌ కార్డులు డిసెంబర్‌ 31 తర్వాత పనిచేయవని రిజర్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్పష్టం చేసింది. గతంలో జారీచేసిన మాగ్నటిక్‌ పూత(స్రి ్టఫ్‌)కల్గిన ఏటీఎం కార్డులతో ఆన్‌లైన్‌ మోసాలు జరుగుతున్న నేపథ్యంలో కార్డులను పూర్తిగా బ్యా న్‌ చేసి చిప్‌ కలిగిన నూతన ఏటీఎం కార్డులను వినియోగాదారులకు అందివ్వనుంది. 

ఆన్‌లైన్‌ మోసాలను అరికట్టేందుకే.. 
2016 వరకు దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు చిప్‌ లేని డెబిట్, క్రెడిట్‌ కార్డులను అం దజేశాయి. ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా ఏటీ ఎం కార్డుల క్లోనింగ్‌ ద్వార మోసాలు పెరిగిపోతున్నాయి. సైబర్‌ నేరగాళ్ల నుంచి ఖాతాదారుల డ బ్బును  కాపాడేందుకు మాగ్నటిక్‌ స్ట్రిఫ్‌తో పాటు, అదనంగా ఈవీఎం చిప్‌ కలిగిన కార్డులు అవసర మని బ్యాంకింగ్‌ సంస్థలు భావించాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల ఖాతాదారులకు హా ్యక్‌ కాకుండా ఉండేందుకు  ఈచర్యలు తీసుకుంటున్న ట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. 

ఈఎంవీతో సేఫ్‌.. 
యూరో, మాస్ట్రో, విసా (ఈ.ఎం.వీ) చిప్‌ కల్గిన ఏటీఎం కార్డుల ద్వారా సమాచా రం హ్యక్‌ కాకుండా సురక్షితంగా ఉంటుంది. గతంలో బ్యాంకులు జా రీ చేసిన మాగ్నటిక్‌ స్ట్రిఫ్‌ కార్డుల ద్వారా క్లోనింగ్‌ చేసి సైబర్‌ నేరగాళ్లు ఈజీగా ఖాతాల నుంచి నగదు దోపిడీకి  పాల్పడుతున్నారు. కొత్తగా వచ్చిన ఈవీ ఎం కార్డులను ఈ విధంగా చేసేందుకు వీ లుండదు. ఎందుకంటే ప్రతి లావాదేవీకి ఒక వ ర్చువల్‌ కీ జనరేట్‌ కావడం వల్ల క్లోనింగ్‌ చేసేం దుకు ఆస్కారం ఉండదు. 

కొత్త కార్డులు జారీ 
మాగ్నటిక్‌ స్ట్రిఫ్‌ గల పాత ఏటీఎం కార్డులున్న ఖాతాదారులకు ఆయా బ్యాంకులు వాటి స్థానం లో చిప్‌ ఉన్న నూతన ఏటీఎం కార్డులను జారీచేస్తున్నాయి. దీనికి ఎలాంటి దరాఖాస్తులు అవస రం లేదని, ఆటోమెటిక్‌గా కార్డులు పోసు ్టద్వారా ఖాతాదారులకు అందిస్తున్నట్లు అధికారులు పే ర్కొన్నారు. అడ్రస్‌లలో తప్పులు, ఇతర కారణాల వల్ల కొత్త కార్డులు అందనివారు బ్యాంకు అధికారులను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు. 

కార్డులు జారీ చేస్తున్నాం 
పాత మాగ్నటిక్‌ కార్డులు కలిగిన ఖాతాదారులకు వాటిస్థానంలో కొత్తగా చిప్‌ కలిగిన ఏటీఎం కార్డులు అందుతాయి. ఖాతాదారుల చిరునామాల్లో తప్పులు, తదితర కారణాలతో కార్డులు అందనివారు బ్యాంక్‌ అధికారులను సంప్రదించాలి. 
– నర్సయ్య, మేనేజర్, ఎస్బీఐ, లింగాపూర్‌  

మరిన్ని వార్తలు