ఏటీఎంలు ఇక హిందీమే బోల్తా హై!

1 Jul, 2014 12:57 IST|Sakshi
ఏటీఎంలు ఇక హిందీమే బోల్తా హై!
ఉత్తరాది రాష్ట్రాల బ్యాంక్ ఏ టీ ఎంలు ఇక హిందీ లోనూ రసీదులు ఇవ్వబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం హిందీ భాష మాట్లాడే రాష్ట్రాల్లో వినియోగదారులు కోరుకుంటే హిందీలో రసీదులు ఇచ్చేలా ఏర్పాటుచేయమని బ్యాంకులను కోరింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్, ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్, ఆర్ధిక వ్యవహారాల శాఖలకు కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసింది. 
 
ఇప్పటి వరకూ మీరు హిందీ లేదా స్థానీయ భాషనువాడినా ఏటీఎం మాత్రం ఇంగ్లీషు రసీదులనే ఇస్తోంది. ఒక్క యూనియన్ బ్యాంక్ మాత్రమే ఇంగ్లీషు, హిందీ సహా మరో ఏడు భాషల్లో రసీదులు ఇస్తోంది. 
 
ఇప్పటి నుంచీ కొనుగోలు చేసే ఏ టీఎంలు హిందీ, స్థానిక భాషల్లో కూడా రసీదులు ఇచ్చేలా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఏ టీ ఎం సేవలు విస్తరించే ప్రక్రియలో ఇంగ్లీషు అవసరం లేకుండా రసీదులు ఇచ్చే వీలుండాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. 
ప్రస్తుతం ఎన్ సీ ఆర్, విన్ కోర్, డైబోల్డ్ అనే మూడు సంస్థలు మన దేశంలో ఏటీఎంలను సరఫరా చేస్తున్నాయి. వీటిలో ఒక్క డైబోల్డ్ మాత్రమే ఇతర భాషల్లో రసీదులు ఇవ్వగలిగే టెక్నాలజీని కలిగి ఉంది.  
మరిన్ని వార్తలు