‘కశ్మీర్‌ ఉగ్ర సాయం’పై ఎన్‌ఐఏ కన్ను

26 Mar, 2019 03:38 IST|Sakshi

వివిధ సంస్థలు, వ్యక్తుల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు యత్నాలు

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తున్న వ్యక్తులు, సంస్థలకు చెందిన ఆస్తులను అటాచ్‌ చేసేందుకు భద్రతా సంస్థలు చర్యలు ప్రారంభించాయి.కశ్మీర్‌కు చెందిన వ్యాపారి జహూర్‌ అహద్‌ షా వతాలీకి చెందిన 10 స్థిరాస్తులతోపాటు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ అధినేత సలాహుద్దీన్‌కు ఇస్లామాబాద్‌లో ఉన్న నివాసం ఉన్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ), జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ), ఆదాయ పన్ను శాఖ ఈ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సంబంధించి చర్యలు చేపట్టనున్నాయి. ఉగ్ర సంస్థలకు సాయం అందించారన్న కేసులో వతాలీ ప్రస్తుతం తీహార్‌ జైలులో ఉన్నారు.

పాక్‌కు చెందిన ఐఎస్‌ఐ సూచనల మేరకు ఉగ్రవాద సంస్థలకు, భద్రతా బలగాలపై రాళ్లు రువ్వే వారికి ఆర్థిక సాయం అందజేస్తున్న హిజ్బుల్‌ ముజాహిదీన్‌ వ్యవస్థాపకుడు సయ్యద్‌ సలాహుద్దీన్‌ సహా, హురియత్‌ నేతలు, వ్యాపారవేత్తలైన 13 మందిని ఎన్‌ఐఏ ఇప్పటికే గుర్తించింది. వీరి ద్వారా కశ్మీర్‌లో ఉగ్రవాదుల చేరికలు, శిక్షణ, పేలుడు సామగ్రి, ఆయుధాలు సమకూర్చడం, అల్లర్లకు పాల్పడే వారికి ఆర్థిక సాయం అందించడం వంటివి జరుగుతున్నాయని ఎన్‌ఐఏ తేల్చింది. కశ్మీర్‌ యువతను భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రేరేపించడంలో ఈ 13 మంది కీలకంగా ఉన్నట్లు గుర్తించింది.  

మరిన్ని వార్తలు