నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే నాన్ బెయిల‌బుల్ కేసు

6 Jun, 2020 09:35 IST|Sakshi

గువ‌హ‌టి : భార‌త్‌లో క‌రోనా తీవ్ర‌రూపం దాలుస్తోంది. ప్ర‌తిరోజూ రికార్డు స్థాయిలో కేసులు న‌మోద‌వుతున్నా కొంద‌రు మాత్రం నిబంధ‌న‌లు గాలికొదిలేస్తున్నారు. అలాంటి వారిపై  క‌ఠిన చ‌ర్య‌లు అమ‌లు చేయడానికి అసోం ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. క్వారంటైన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించినా, విధుల్లో ఉన్న వైద్య సిబ్బందిపై దురుసుగా ప్ర‌వ‌ర్తించినా వారిపై హ‌త్యాయ‌త్నం కేసుతో పాటు నాన్ బెయిల‌బుల్ కేసు న‌మోదుచేస్తామని హెచ్చ‌రించింది. ఈ మేర‌కు ఆరోగ్య‌శాఖ మంత్రి హిమంతా బిస్వా శ‌ర్మ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. (కరోనా పేషంట్లకు మంచాలు లేవు.. స్పందించిన మంత్రి )

ఇటీవ‌లె బొంగైగావ్, చిరాంగ్ జిల్లాలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంట‌ర్ల‌లో వైద్యుల‌పై ఉమ్మివేయ‌డం, దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డం లాంటివి ప్ర‌భుత్వం దృష్టికి వెళ్లాయి. గ‌తంలోనూ ఇలాంటివి  జ‌ర‌గ‌డంతో పున‌రావృతం కాకుండా ఈ మేర‌కు అసోం ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా పోరులో ముఖ్య‌పాత్ర పోషిస్తున్న వైద్యుల‌పై ఇలాంటి చ‌ర్య‌లు అమాన‌వీయం అని మంత్రి హిమంతాబిస్వా అన్నారు. క్వారంటైన్ సెంట‌ర్లలో నిర్ల‌క్ష్య ధోర‌ణి ఇత‌రుల ప్రాణాల‌ను కూడా ప్ర‌మాదంలో నెట్టివేస్తుంద‌ని అన్నారు. అంతేకాకుండా క్వారంటైన్ సెంట‌ర్‌లో ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదురైనా నేరుగా త‌న‌ను సంప్ర‌దించ‌వ‌చ్చని తెలిపారు.  కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో రోగుల‌కు అందించే ఆహారం నాణ్య‌త బాలేందంటూ ప‌లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఎలాంటి ఇబ్బందులున్నా అధికారుల దృష్టికి తీసుకు రావాల‌ని పేర్కొన్నారు. (త్వరలో వెబినార్‌ కోమా వ్యాధి: ఆనంద్‌ మహీంద్రా )


 

మరిన్ని వార్తలు