ఆటోడ్రైవర్‌ ఔదార్యం

28 Oct, 2017 07:18 IST|Sakshi
విద్యుదాఘాతంతో కింద పడిన గద్దపై నీళ్లు చల్లుతున్న ముత్తు కృష్ణన్‌

విద్యాతాఘాతానికి గురైన గద్దను రక్షించిన ఆటోడ్రైవర్‌

అన్నానగర్‌: కుంభకోణం సమీపంలో విద్యుత్‌ షాక్‌ కొట్టి ప్రాణాలకు పోరాడుతున్న ఓ గద్దను ఆటో డ్రైవర్‌ రక్షించి చికిత్స అందించాడు. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. కుంభకోణం పొట్రామరై కులమ్‌ సమీపంలో గురువారం ఉదయం ఓ గద్ద విద్యుత్‌ తీగను ఢీకొంది. దీంతో విద్యుత్‌ షాక్‌ గురై కిందపడి తీవ్రంగా గాయపడింది. ఆ సమయంలో అటుగా వెళ్తూ దీన్ని గమనించిన కుంభకోణం పాత అరన్‌మలై వీధికి చెందిన ఆటో డ్రైవర్‌ ముత్తు కృష్ణన్‌ గద్దని రక్షించి దానిపై నీళ్లు చల్లాడు.

అనంతరం దాన్ని లక్ష్మీ విలాస్‌ వీధిలో ఉన్న ప్రభుత్వ పశువుల ఆస్పత్రికి తీసుకెళ్లాడు. నోటి దారిన గ్లూకోస్‌ ఎక్కించారు. అనంతరం ముత్తుపిల్‌లై మండపంలో ఉన్న అటవీ శాఖ కార్యాలయంలో దాన్ని అప్పగించాడు. గద్ద ప్రాణాలు కాపాడిన ముత్తు కృష్ణన్‌ను అక్కడి వారు అభినందించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా