సిక్కింలో హిమపాతం.. జవాను గల్లంతు

14 May, 2020 17:00 IST|Sakshi

న్యూఢిల్లీ: సిక్కింలో దారుణం జ‌రిగింది. విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న భార‌త సైనిక బృందంపై పెద్ద ఎత్తున మంచు చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. వివరాలు.. ఉత్తర సిక్కిం ప్రాంతంలోని లుగ్నాక్ లాలో సుమారు 17 నుంచి 18 మంది సైనికులు పెట్రోలింగ్-కమ్-స్నో క్లియరెన్స్‌ విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి మంచు చరియలు ఈ బృందంపై విరుచుకు పడ్డాయి. ఈ ప్రమాదంలో ఒక సైనికుడిని మినహా మిగతా వారందరిని రక్షించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. గల్లైంతన సైనికుడి ఆచూకీ కోసం గాలింపు కొన‌సాగుతుందన్నారు. మిగతా జవాన్లంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు