హోలీ వేడుకలు చేసుకుంటున్నారా.. జాగ్రత్త!

22 Mar, 2016 20:27 IST|Sakshi

న్యూఢిల్లీ: హోలీ వేడుకలు చేసుకునేటపుడు ప్రజలు, ముఖ్యంగా చిన్న పిల్లలు కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్లో అమ్మే రంగులకు బదులుగా, సొంతంగా తయారు చేసిన రంగులతో హోలీ సంబరాలు చేసుకుంటే మంచిదని తెలియజేశారు. పూలు, మూలికలతో కలిపి రంగులను తయారు చేసుకుంటే మంచిదని సూచించారు.

మార్కెట్లో అమ్మే రంగులను ఎక్కువగా రసాయనాలతో తయారు చేస్తారని, వీటిని వాడటం వల్ల చర్మం, కళ్లకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరించారు. ప్రతి ఏటా హోలీ తర్వాత ఇలాంటి కేసులు వస్తున్నాయని తెలిపారు. మార్కెట్లో పేస్ట్, పౌడర్, ద్రవ రూపంలో లభ్యమయ్యే రంగులను రసాయనాలను ఉపయోగించి తయారు చేస్తున్నారని చెప్పారు. మరికొందరు క్రోమియం, మెర్కురీలతో రంగులను తయారు చేస్తున్నారని, ఇవి చాలా ప్రమాదమని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు