అయోధ్య తీర్పు : 27ఏళ్ల దీక్షకు విరమణ

12 Nov, 2019 07:34 IST|Sakshi

జబల్‌పూర్‌: శ్రీరాముని వెంట వనవాసానికి వెళ్లిన తన భర్త లక్ష్మణుడు తిరిగి వచ్చే వరకు ఊర్మిళ 14 ఏళ్లపాటు నిద్రలోనే గడిపినట్లు రామాయణం చెబుతోంది. అది అప్పటి ఊర్మిళ కథ. అదేవిధంగా, రామాలయం నిర్మాణానికి దారులు పడే వరకు సాధారణ ఆహారం తినబోనంటూ దీక్షబూనారు మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌కు చెందిన నేటి ఊర్మిళ. అయోధ్యలో రామమందిరం కల సాకారం కావాలని ఎదురుచూస్తున్న వారిలో సంస్కృత ఉపాధ్యాయురాలిగా పనిచేసిన ఊర్మిళా చతుర్వేది(81) ఒకరు. 1992లో బాబ్రీ మసీదు కూల్చేసిన రోజు నుంచి సాధారణ ఆహారం తీసుకోవడం మానేశారు. 27 ఏళ్లుగా పాలు, పండ్లనే తీసుకుంటున్నారు. అయోధ్య వివాదాన్ని పరిష్కరిస్తూ  సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో ఊర్మిళ తిరిగి సాధారణ ఆహారం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. 

సరయూ తీరంలో కార్తీక పౌర్ణమి
మంగళవారం కార్తీక పౌర్ణమి కావడంతో లక్షలాది మంది భక్తులు అయోధ్యలోని సరయూనదిలో కార్తీక దీపోత్సవాన్ని జరుపుకోనున్నారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో అధికారులు.. ఘజియాబాద్‌లోని ఆయోధ్య ద్వారం వద్ద నుంచి అయోధ్య నగరం వరకు 4 కిలోమీటర్ల పొడవునా కట్టుదిట్టమైన భద్రత కలి్పంచారు. ఆ వైపుగా వాహనాల రాకపోకలను నిషేధించారు. 

మరిన్ని వార్తలు