19 కొత్త ఎయిమ్స్‌లలో ఆయుర్వేద శాఖలు

6 Nov, 2018 04:09 IST|Sakshi

న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పాటుచేసిన 19 ఆలిండియా ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌)లలో ఆయుర్వేద శాఖలను నెలకొల్పనున్నట్లు ఆయుష్‌ శాఖ సహాయమంత్రి శ్రీపాద్‌ నాయక్‌ చెప్పారు. సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌), ఇతర పారమిలటరీ దళాలకు చెందిన ఏడు ఆస్పత్రుల్లోనూ ఆయుర్వేద శాఖలను ఏర్పాటుచేయనున్నారు. కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలోని 100 ఈఎస్‌ఐసీ ఆస్పత్రుల్లోనూ ఆయుర్వేద శాఖల ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయని నాయక్‌ తెలిపారు. అంటురోగాలుకాని వ్యాధుల వ్యాప్తి నిరోధానికి సంబంధించిన జాతీయ పథకాన్ని ఇప్పుడున్న ఆరు రాష్ట్రాలతోపాటు మరిన్ని రాష్ట్రాల్లో అమలుచేస్తామని ఆయన వెల్లడించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు