సాధువు ఫోటో వైరల్

8 Jan, 2018 08:48 IST|Sakshi

అలహాబాద్ : ట్రాక్టర్, లారీ లాంటి భారీ వాహనాలను తాడుతో పట్టుకుని ముందుకు లాగడాన్ని అప్పుడప్పు చూసే ఉంటాం. మరీ కొందరైతే జుట్టుతోనే లేక పళ్ల సాయంతోనో లాగడం కూడా చూసే ఉంటాం. అయితే ఓ సాధువు మాత్రం వీటన్నింటినీ  మించి చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తర భారతదేశంలో మినీ కుంభమేళాగా ప్రసిద్ధిచెందిన మాఘ్ మేళా ప్రతి ఏటా జరుగుతుంటుంది. ఈ మేళాకు దేశ నలుమూలల నుంచి భక్తులు వచ్చి గాంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. మేళా సమయంలో పవిత్ర జలాలతో స్నానం చేస్తే పాపాల నుండి విముక్తి కలుగుతుందని భావిస్తారు.

అలహాబాద్ లో గంగా, యమునా, సరస్వతి నదుల సంగమంగా ప్రసిద్ధిచెందిన ప్రయాగ్ లో ఓ సాధువు చేసిన సాహసం హాట్ టాపిక్ గా మారింది. ట్రాక్టర్ ను ఓ తాడు సాయంతో తన మర్మాంగానికి కట్టుకుని ఓ సాధువు ముందుకు లాగారు. తెల్ల జుట్టు, గడ్డంతో బొట్టు పెట్టుకుని, మెడలో రుద్రాక్ష మాలలు ధరించి నగ్నంగా ఉన్న ఆ సాధువు అసాధారణ ప్రదర్శనను ఇచ్చారు. దీనికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అయితే ఇలాంటి ప్రర్శనలు ఇదేం మొదటి సారి కాదు. ఇంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో సాధువులు ఇలాంటి ప్రదర్శనలు ఇచ్చారు. 2014లో కూడా ఓ సాధువు డజన్ ఇటుకలను తన మర్మావయవానికి కట్టుకొని ఇచ్చిన ప్రదర్శనకు సంబంధించి ఓ వీడియో అప్పుడు వైరల్ అయింది. 2016లో కూడా కుంభమేళా సమయంలో ఓ సాధువు పెద్ద బండారాయిని తాడుసాయంతో మర్మావయవానికి కట్టుకొని ఓ ప్రదర్శన ఇచ్చారు.

2018 మాఘ్ మేళాకు సంబంధించి మరిన్ని ఫోటోలు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా