1992 నుంచి 2017 వరకు ఇలా..

20 Apr, 2017 03:07 IST|Sakshi
1992 నుంచి 2017 వరకు ఇలా..
  • 1992,    డిసెంబర్‌: బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో కరసేవకులపై, అలాగే రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినందుకు బీజేపీ నేతలు ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషీ, మరికొందరిపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.
  • 1993,    అక్టోబర్‌: అడ్వాణీతో పాటు మరి కొందరు నేతలు ఈ కుట్రలో భాగస్వాములని సీబీఐ కాంపోజిట్‌ చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.
  • 2001,    మే 4: అడ్వాణీ, జోషీ, ఉమాభారతి, బాల్‌థాకరే తదితరులపై కేసు విచారణను అదనపు సీబీఐ కోర్టు కొట్టివేసింది.
  • 2004,    నవంబర్‌ 2: సాంకేతిక కారణాలను చూపి కేసును కొట్టివేయడంపై సీబీఐ హైకోర్టులోని లక్నో బెంచ్‌ను ఆశ్రయించింది. దీంతో న్యాయస్థానం నిందితులకు నోటీసులు జారీ చేసింది.
  • 2010,    మే 20: సీబీఐ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. దాఖలు చేసిన పునర్విచారణ పిటిషన్‌కు ఎటువంటి యోగ్యత లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
  • 2011,    ఫిబ్రవరి: హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా సీబీఐ సుప్రీంను ఆశ్రయించింది.
  • 2017,    మార్చి 6: బాబ్రీ కుట్ర కేసులో బీజేపీ నేతలపై పునర్విచారణకు అత్యున్నత న్యాయస్థానం సుముఖత వ్యక్తం చేసింది.
  • మార్చి 21:    అయోధ్య వివాద పరిష్కారానికి తాజాగా ప్రయత్నాలు ప్రారంభించాలని సుప్రీం కోర్టు సూచించింది.
  • ఏప్రిల్‌ 6:    నిర్ణీత సమయంలో విచారణ పూర్తిచేయడానికి సుముఖత వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం, సీబీఐ విజ్ఞప్తిపై ఆదేశాలను రిజర్వ్‌ చేసింది.
  • ఏప్రిల్‌19:    అడ్వాణీ, జోషీ, కేంద్ర మంత్రి ఉమాభారతీలపై నేరపూరిత కుట్రకు సంబంధించి విచారణను సుప్రీం పునరుద్ధరించింది. అంతేకాకుండా కరసేవకులతో పాటు వీఐపీలను వీరితో కలిపి విచారిస్తామని స్పష్టం చేసింది.
     
మరిన్ని వార్తలు