హిందూ సంస్థల శౌర్య దివస్‌.. ముస్లింల విషాద దినం

7 Dec, 2017 02:53 IST|Sakshi

అయోధ్య / లక్నో: బాబ్రీ మసీదు కూల్చివేతకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ), బజరంగ్‌ దళ్‌ ‘శౌర్య దివస్‌’ పేరిట సంబరాలు నిర్వహించగా, ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) వంటి ముస్లిం సంస్థలు ‘విషాద దినం’గా పాటించాయి. అయోధ్యతో పాటు ఫైజాబాద్‌లో భారీసంఖ్యలో పోలీస్‌ బలగాలను మోహరించారు.

వీహెచ్‌పీ ఉత్తరప్రదేశ్‌లో పలుచోట్ల సంబరాలు నిర్వహించింది. మందిరం నిర్మాణానికి ప్రస్తుతం దేశంలో పరిస్థితి అనుకూలంగా ఉందని శ్రీరామ్‌ జన్మభూమి న్యాస్‌ చైర్మన్‌ మహంత్‌ గోపాల్‌దాస్‌ చెప్పారు. బాబ్రీ కూల్చివేత ఘటనలో లిబర్హాన్‌ కమిషన్‌ దోషులుగా తేల్చిన వారందరికీ కఠిన శిక్ష విధించాలని ఏఐఎంపీఎల్‌బీ కార్యనిర్వాహక సభ్యుడు రషీద్‌  డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు