కేంద్రమంత్రిగా గాయకుడు బాబుల్ సుప్రియో

9 Nov, 2014 15:11 IST|Sakshi
కేంద్రమంత్రిగా గాయకుడు బాబుల్ సుప్రియో
బెంగాల్ సినీ పరిశ్రమ, బాలీవుడ్ లోనూ గాయకుడిగా, నటుడిగా రాణించిన బాబుల్ సుప్రీయో 2014లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. బీజేపీలో చేరిన బాబుల్ పశ్చిమ బెంగాల్ లోని అసాన్ సోల్ నియోజకవర్గం నుంచి లోకసభకు పోటీ చేసి 74 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. 
 
జననం:
1970 లో పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర్ పారా లో జన్మించారు. ప్రముఖ సంగీత దర్శకుడు బనికంత ఎన్ సీ బారల్ మనవడు. చిన్నతనం నుంచే తాత నుంచి సంగీతంలో మెలుకువలు నేర్చుకుని గాయకుడిగా రాణించారు. 
 
విధ్యాభ్యాసం, వృత్తి: 
1991లో కలకత్తా యూనివర్సిటి నుంచి కామర్స్ లో పట్టభద్రులయ్యారు. ఆతర్వాత స్టాండర్ట్ చార్టెర్డ్ బ్యాంక్ లో ఉద్యోగం చేశారు. సంగీత వైపు దృష్టి మరలడంతో ప్రముఖ సంగీత దర్శకులు కల్యాణ్ జీ, ఆనంద్ జీ వద్ద శిష్కరికం చేశారు. సల్మాన్ ఖాన్ చిత్రం హల్ బ్రదర్, అక్షయ్ ఖిలాండి యోంకీ ఖిలాడీ, షారుక్ (కహోనా ప్యార్ హై) చిత్రాల్లో పాటలు పాడారు. బెంగాల్ చిత్రాల్లోనూ, మిస్టర్ జో బి. కార్ వాల్హో చిత్రంలో నటించారు. 
 
 
రాజకీయ రంగం:
2014లో జరిగిన లోకసభ ఎన్నికల్లో అసాన్సోల్ నియోజకవర్గం నుంచి 70,480 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2014 నవంబర్ 9 తేదిన జరిగిన కేంద్రమంత్రి వర్గ విస్తరణలో కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 
మరిన్ని వార్తలు