బుజ్జి ధోనీ.. పేర్లుపెట్టి పిలిచేస్తోంది!

27 Jul, 2016 19:04 IST|Sakshi
బుజ్జి ధోనీ.. పేర్లుపెట్టి పిలిచేస్తోంది!

భారత క్రికెట్ వీరుడు మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్ లో బిజిబిజీగా ఉన్నా.. ఆయన భార్య సాక్షి సింగ్ మాత్రం.. తమ ముద్దుల కూతురు, చిట్టి పొట్టి అందాల చిన్నారి జివాతో పూర్తి సమయాన్ని గడుపుతూ మాతృత్వాన్ని ఆస్వాదిస్తుందన్న విషయం తెలిసిందే. . అదే నేపథ్యంలో  అభిమానులకోసం సాక్షీ... జివా ఫోటోలను ఎన్నోసార్లు షేర్ చేశారు. ఇప్పుడు తాజాగా థోనీ... తన ముద్దుల కూతురు జివాతో ఆటపాటల్లో మునిగిపోయిన అద్భుత క్షణాల వీడియోను సాక్షీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జివా మాటల మూటలతో కూడిన వీడియో ఇప్పుడు అందర్నీ కట్టి పడేస్తోంది.

అమ్మలాలన, నాన్నపానలో అత్యంత గారాలను ఒలకబోస్తూ... చిలకపలుకులు పలుకుతున్న జివా వీడియో సోషల్ మీడియాలో ఆకర్షణగా మారింది. భారత క్రికెట్ ఆటగాడు మహేంద్రసింగ్ థోనీ..అభిమానులకోసం తమ చిట్టితల్లి చిత్రాలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేసే సాక్షీ థోనీ.. ఇటీవల చిన్నారి జివా తండ్రితో ఆడుతున్న ఓ వీడియోను పోస్ట్ చేసింది.  ఇప్పుడు ఆ వీడియో  అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. లిటిల్ గాల్.. జివా.. వచ్చీ రాని మాటలతో నాన్న.. అమ్మలను.. తనదైన రీతిలో పేరుపెట్టి పిలుస్తుంటే... ఆ దంపతులు మురిసిపోవడం వీడియోలో అభిమానులను అత్యంత ఆకర్షిస్తోంది.

పిల్లలు పక్కన ఉంటే ప్రపంచాన్ని మర్చిపోవచ్చన్న విషయం జివా వీడియోను చూస్తే అర్థమౌతుంది. చిన్నారుల కళ్ళలో చూస్తూ, వారికి వచ్చీరాని మాటలను వింటూ ఎంతకాలమైనా గడిపేయచ్చనిపిస్తుంది. దేశానికి రాజైనా తల్లికి కొడుకే అన్నట్లుగా .. ఎంత సెలబ్రిటీలయినా చిన్నారుల విషయానికి వస్తే అంతేమరి...

మరిన్ని వార్తలు