అత్యాచారాలపై మోడీని ప్రశ్నించరే

5 Jun, 2014 10:27 IST|Sakshi
అత్యాచారాలపై మోడీని ప్రశ్నించరే

మీడియాపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. గతంలో నిర్భయ అత్యాచార ఘటన విషయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్నే లక్ష్యంగా చేసుకున్న మీడియా..... నేడు యూపీలో మహిళలపై వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనలపై ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీని ఎందుకు లక్ష్యంగా చేయడంలేదంటూ దిగ్విజయ్ సింగ్ మీడియాను ప్రశ్నించారు. 2012 డిసెంబర్లో దేశ రాజధాని హస్తినలో నిర్భయపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై స్పందించాలని మీడియా ప్రధాని మన్మోమన్ సింగ్ వెంటపడిన తీరు దిగ్విజయ్ సింగ్ ఈ సందర్బంగా విశదీకరించారు.

 

వరుస అత్యాచారాలతో ఉత్తరప్రదేశ్ అట్టుకుతున్న పాపం మీడియాకు మాత్రం నరేంద్ర మోడీని ప్రశ్నించలేకపోతుందంటూ ఆయన ఎద్దేవా చేశారు. మీడియా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు.మరి ముఖ్యంగా బుదాయూలో అక్కచెల్లిళ్లపై సామూహిక అత్యాచారం జరిపి ఆపై చెట్టుకు ఉరివేసిన సంఘటన దారణమని దిగ్విజయ్ సింగ్ గురువారం తన ట్విట్టర్లో వెల్లడించారు.

మరిన్ని వార్తలు