'బెయిల్ ఇవ్వడం కుదరదు.. 30 వరకు కస్టడీలోనే'

19 Jan, 2016 19:44 IST|Sakshi

కోల్ కతా: ఫుల్లుగా తాగి నిర్లక్ష్యంగా కారు నడిపి యువ మిలటరీ అధికారిని ఢీకొట్టిన కేసులో నిందితులకు బెయిలిచ్చేందుకు కోర్టు నిరాకరించింది. వారిని ఈ నెల(జనవరి) 30 వరకు పోలీసుల కస్టడీకి అనుమతినిచ్చింది. రిపబ్లిక్ డేను పురస్కరించుకొని ఈ నెల 13న రెడ్ రోడ్డు ఏరియాలో వైమానిక దళ సైనికులు రిహార్సల్స్ చేస్తుండగా సాంబియా సోహ్రాబ్, సోనూ అలియాస్ షానవాజ్ ఖాన్ వేగంగా ఆడి కారులో వెళుతూ అభిమన్యు గౌడ్ అనే సైనికుడిని ఢీకొట్టారు.

అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. దీంతో కోల్ కతా పోలీసులు ఢిల్లీ పోలీసుల సహాయంతో వారిని ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా నిందితులు బెయిల్ పిటిషన్ పెట్టుకోగా కోర్టు బెయిలిచ్చేందుకు నిరాకరించింది. వీరిలో సాంబియా ఆర్జేడీ మాజీ ఎమ్మెల్యే మహ్మద్ సోహ్రాబ్ కుమారుడు. వీరిపై హత్య, నేరపూరిత కుట్ర, సాక్ష్యాలను మాయం చేయాలని ప్రయత్నించడం, హానీ కలిగించడంవంటి ఆరోపణల పేరిట కేసులు నమోదు చేశారు.
 

మరిన్ని వార్తలు