సమీర్ గైక్వాడ్కు బెయిల్ నిరాకరణ

12 Jul, 2016 08:42 IST|Sakshi
సమీర్ గైక్వాడ్కు బెయిల్ నిరాకరణ

ముంబై: హేతువాది, కమ్యూనిస్టు నేత గోవింద్ పన్సారే హత్యకేసులో అరెస్టయిన సనాతన్ సంస్థ సభ్యుడు సమీర్ గైక్వాడ్ బెయిల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నేరంతో అతని ప్రమేయానికి ప్రాథమిక ఆధారాలున్నాయని, ప్రత్యక్ష సాక్షి చెప్పిన ఆధారం ఉందని పేర్కొంది. పన్సారేను చంపినట్టు గైక్వాడ్ ఓ మహిళకు ఫోన్‌లో చెప్పినట్లుగా ఉన్న ఆడియో సంభాషణను కోర్టు ప్రస్తావించింది.

‘గైక్వాడ్‌కు పన్సారేతో వ్యక్తిగత శత్రుత్వం లేదు. అయితే సైద్ధాంతిక విభేదాలున్నాయి. అందుకే ఆయన హత్యకు గురయ్యారు’ అని స్టసిస్ సీవీ భదాంగ్ పేర్కొన్నారు. పథకం ప్రకారం హత్య జరిగిందని పోలీసులు సేకరించిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. గత ఏడాది ఫిబ్రవరిలో కొల్హాపూర్‌లో మార్నింగ్ వాక్‌కు వెళ్లిన పన్సారే దంపతులను దుండగులు తుపాకీతో కాల్చి హత్య చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు