బాలాకోట్‌లో మకాం వేసిన సూసైడ్‌ బాంబర్లు!

14 Oct, 2019 19:09 IST|Sakshi

న్యూఢిల్లీ : పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో మళ్లీ ఉగ్ర కార్యకలాపాలు మొదలైనట్టు వెలువడిన వార్తా కథనాలు నిజమేననిపిస్తున్నాయి. సుమారు 45 నుంచి 50 మంది జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నారని హోంశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. వారిలో సూసైడ్‌ బాంబర్లు కూడా ఉన్నట్టు తెలిపారు. కశ్మీర్‌లో అలజడి సృష్టించేందుకు పాకిస్తాన్‌ కుట్రలు చేస్తోందని.. దానిలో భాగంగానే బాలోకోట్‌లో ఉగ్ర శిబిరాలు తెరుచుకున్నాయని చెప్పారు. ఆర్టికల్‌ 370 రద్దుతోనే కశ్మీర్‌లో హింస చెలరేగిందని ప్రపంచాన్ని నమ్మించేందుకు పాకిస్తాన్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
(చదవండి : ‘బాలాకోట్‌’ దాడులపై మళ్లీ అనుమానాలు)

ఇక కశ్మీర్‌లో దాడులకు పాల్పడేందుకు జైషే ఉగ్రవాదులు రెక్కీ కూడా నిర్వహించారని నిఘా వర్గాలకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. అయితే, ఉగ్రమూకల్ని ఎదుర్కోవడానికి ఆర్మీ సిద్ధంగా ఉందని, వారికి ఎలాంటి అడ్డంకులు లేవని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇక పుల్వామా దాడికి సమాధానంగా భారత వైమానికదళం దాడుల్లో బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమైన సంగతి తెలిసిందే.  దాంతో 6 నెలలుగా అక్కడ మానవ సంచారం తగ్గిపోయింది.

అయితే, భారత సైనికాధిపతి బిపిన్‌రావత్‌ నెలరోజుల క్రితం  మాట్లాడుతూ.. బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలను పాకిస్తాన్‌ ఇటీవలే తిరిగి ప్రారంభించిందని వ్యాఖ్యానించారు. మంచు కరుగుతున్న ప్రాంతాల గుండా, మంచు తక్కువగా ఉన్న ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్‌లోని ఉత్తర భాగంనుంచి భారత్‌లోకి చొరబడేందుకు 500 మంది ఉగ్రమూకలు వేచిఉన్నారనీ, ఈ సంఖ్య సమయానుకూలంగా మరవచ్చుననీ రావత్‌ చెప్పారు.
(చదవండి : భారత్‌ ప్రకటనపై పాక్‌ ఆగ్రహం)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా