హనీమూన్‌కు అక్కడికి వెళుతున్నారు

29 Aug, 2017 22:10 IST|Sakshi
హనీమూన్‌కు అక్కడికి వెళుతున్నారు

ముంబై(మహారాష్ట్ర): భారతీయ యువజంటల్లో ఎక్కువమంది బాలి ద్వీపానికి హనీమూన్‌ కోసం వెళ్తున్నట్టు ఓ సర్వేలో తేలింది. ఆ తర్వాతి స్థానాల్లో మల్దీవులు, థాయ్‌లాండ్‌ ఉన్నాయట. పెళ్లి చేసుకోబోయే జంటలు దాదాపు ఏడాది ముందుగానే తమ హనీమూన్‌ టూర్‌ను ప్లాన్‌ చేసుకుంటున‍్నట్లు తమ సర్వేలో వెల్లడైందని ఈజీగోఒన్‌ డాట్‌ కామ్‌ సీఈవో నీలు సింగ్‌ తెలిపారు. ఇందులో భాగంగా కొత్త జంటలు వీసా ఆన్‌ అరైవల్‌ విధానం అమల్లో ఉన్న దేశాలకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నాయని వెల్లడించారు. వీటిల్లో ఇండోనేసియా కూడా ఉంది. ఈ దేశంలోని ప్రముఖ బాలి దీవి బీచ్‌ల్లో గడిపేందుకు మక్కువ చూపుతున్నారని చెప్పారు. ఈ దీవికి నేరుగా విమాన సౌకర్యం ఉండటంతోపాటు అందమైన బీచ్‌లు, ప్రకృతి రమణీయత పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయన్నారు.

అయితే, గ్రీస్‌, పారిస్‌, సెచెల్స్‌ లను కూడా కొత్త జంటలు ఇష్టపడుతున్నాయని చెప్పారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఈ ప్రాంతాల కోసం ఆన్‌లైన్‌లో వెతికే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు