అధికారుల నిర్లక్ష్యం.. రోడ్డుపై దొరికిన బ్యాలెట్‌

8 Dec, 2018 10:21 IST|Sakshi

జైపూర్ ‌: రాజస్థాన్‌లో ఎన్నికల అధికారులు బ్యాలెట్‌ యూనిట్‌లను తరలించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బరాన్‌ జిల్లాలో కిషన్‌ గంజ్‌ అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలోని షహాబాద్‌లో రోడ్డుపైనే  బ్యాలెట్‌ యూనిట్‌  లభించింది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఈవీఎం మిషిన్లను స్ట్రాంగ్‌ రూంలకు తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేశారు. రోడ్డుపై లభించిన బ్యాలెట్‌ యూనిట్‌ను కిషన్‌గంజ్‌లోని స్ట్రాంగ్‌ రూంకు తరలించారు.

రాజస్థాన్‌ అసెంబ్లీలోని 200 స్థానాలకు గాను ఒక్కటి మినహా 199 సీట్లకు శుక్రవారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. బహుజన్‌ సమాజ్‌ పార్టీ అభ్యర్ధి లక్ష్మణ్‌ సింగ్‌ హఠాన్మరణంతో ఆల్వార్‌ జిల్లా రామ్‌గఢ్‌ నియోజకవర్గం ఎన్నిక నిలిచిపోయింది. ఓటింగ్‌ ముగిసే సాయంత్రం 5 గంటల సమయానికి 74.02% పోలింగ్‌ నమోదైందని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు