టెండ‌ర్ల‌లో చైనా కంపెనీలను అనుమ‌తించొద్దు

17 Jun, 2020 09:13 IST|Sakshi

న్యూఢిల్లీ: ల‌డ‌ఖ్ గాల్వ‌న్ లోయ‌లో భార‌త్ - చైనా ఆర్మీ మ‌ధ్య జ‌రిగిన దాడుల్లో భార‌త సైనికులు ప్రాణాలు కోల్పోవ‌డంపై ఆరెస్సెస్ అనుబంధ సంస్థ స్వ‌దేశీ జాగ‌ర‌న్ మంచ్ (ఎస్‌జేఎమ్‌) తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది. మ‌ర‌ణించిన సైనికుల‌కు నివాళిగా ప్ర‌భుత్వం చేప‌ట్టే టెండ‌ర్ల‌లో చైనా కంపెనీలు పాల్గొన‌కుండా నిషేధం విధించాల‌ని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. అదేవిధంగా దేశంలో చైనా ఉత్ప‌త్తుల‌ను బ‌హిష్క‌రించే దిశ‌గా అడుగులు వేయాల‌ని సూచించింది. బుధ‌వారం ఎస్‌జేఎమ్ కో క‌న్వీన‌ర్ అశ్వ‌ని మ‌హాజ‌న్ మాట్లాడుతూ.. న‌టీన‌టులు, క్రికెట‌ర్లు, ఇత‌ర సెల‌బ్రిటీలు సైతం చైనా ఉత్ప‌త్తుల‌ను ప్రోత్స‌హించ‌వ‌ద్ద‌ని కోరారు. (సరిహద్దు వివాదం : డ్రాగన్‌ కుయుక్తి)

కాగా మే 5వ తేదీ నుంచి చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతున్న విష‌యం తెలిసిందే. దీనిపై రెండు దేశాల మ‌ధ్య చర్చ‌లు మేనేజ‌ర్ జ‌న‌ర‌ల్ స్థాయి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో రెండు దేశాలు త‌మ సైన్యాల‌ను వెన‌క్కు త‌ర‌లించ‌డం ప్రారంభించాయి. ఇదే స‌మ‌యంలో సోమ‌వారం రాత్రి ల‌డ‌ఖ్‌లో భార‌త్-చైనా ఆర్మీ మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో హింసాత్మ‌క ఘ‌ర్ష‌ణ‌లు తలెత్తాయి. ముఖాముఖీ పోరాటంలో రాళ్లు, ఇనుప రాడ్‌ల‌తో చైనా సైనికులు దాడి చేశార‌ని ఆర్మీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఈ దాడిలో 20 మంది భార‌తీయ సైనికులు అమ‌రుల‌య్యారు. చైనాకు కూడా భారీగా ప్రాణ‌న‌ష్టం సంభ‌వించిన‌ట్లు స‌మాచారం. ( విషం చిమ్మిన చైనా )

మరిన్ని వార్తలు