కాలేజీల్లో జంక్‌ ఫుడ్‌ అమ్మకాలపై నిషేధం

23 Aug, 2018 05:13 IST|Sakshi

న్యూఢిల్లీ: అన్ని విశ్వవిద్యాలయాలు, ఉన్నత స్థాయి విద్యా సంస్థల్లో జంక్‌ ఫుడ్‌ అమ్మకాల్ని నిషేధించాలని యూజీసీ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ‘విద్యార్థుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి కళాశాలల్లో జంక్‌ ఫుడ్‌ను నిషేధించాల్సిన అవసరముంది. ఆరోగ్య కరమైన పదార్థాలను అందించడం వల్ల విద్యా ర్థుల్లో ఏదైనా నేర్చుకోవాలనే దృక్పథం అలవ డుతుంది. ఊబకాయ సమస్యను సైతం దూరం చేయవచ్చు.

అధికబరువుకు జీవనశైలి రుగ్మ తలకు ప్రత్యక్ష సంబంధం ఉంది. జంక్‌ఫుడ్‌ నిషేధం వల్ల ఈ రుగ్మతలన్నింటిని అధిగమించవచ్చు’ అని యూజీసీ పేర్కొంది. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఇదివరకు ఇచ్చిన ఆదేశాల మేరకు విద్యా సంస్థల ప్రాంగణాల్లో జంక్‌ఫుడ్‌ అమ్మకాలపై నిషేధిస్తూ యూజీసీ ఈ నిర్ణయం తీసుకుంది. జంక్‌ఫుడ్, దాని వల్ల కలిగే దుష్ఫలితాలపై యువతకు అవగాహన కల్పించాలని యూజీసీ ఉత్తర్వుల్లో వర్సిటీలకు సూచించింది. 

మరిన్ని వార్తలు