ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేత

27 Feb, 2020 06:20 IST|Sakshi

న్యూఢిల్లీ: దాదాపు ఆరు నెలలుగా ఉల్లి ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రబీ సీజన్‌ నేపథ్యంలో ఉల్లి ధర పడిపోయే అవకాశముంది. దీంతో రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ‘ఉల్లి ధరను స్థిరీకరించినప్పటి నుంచి ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది మార్చిలో 40 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ఉల్లి పండే అవకాశముంది’ అని ఆహార శాఖ మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు