బాయ్‌కాట్‌ చైనా

19 Jun, 2020 06:19 IST|Sakshi
కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవాలే

న్యూఢిల్లీ: సరిహద్దులో ఘర్షణ నేపథ్యంలో భారత్‌లో చైనా ఆహార పదార్థాలను అమ్ముతున్న అన్ని రెస్టారెంట్లు, హోటళ్లను మూసేయాలంటూ కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవాలే పిలుపునిచ్చారు. చైనాకు చెందిన ఆహారాన్ని బహిష్కరించాలన్నారు. రోజూవారీ కార్యకలాపాల్లో చైనా ఉత్పత్తుల వాడకాన్ని బహిష్కరించాలంటూ కేంద్ర మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. చైనా వైఖరిని అందరం చూస్తున్నామని అందుకే చైనా ఉత్పత్తులను వాడరాదని ఆయన అన్నారు. చైనా నుంచి వచ్చే ఉత్పత్తులకు ఇకపై బీఐఎస్‌ నాణ్యత ఉండేలా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. చైనా నుంచి అక్రమంగా భారత్‌లోకి వచ్చే ఫర్నీచర్‌ వంటి వాటిలోనూ కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

మరిన్ని వార్తలు