హిమాచల్‌ గవర్నర్‌గా నేడు దత్తాత్రేయ బాధ్యతలు

11 Sep, 2019 03:13 IST|Sakshi

దత్తాత్రేయతో ప్రమాణం చేయించనున్న హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌

ముషీరాబాద్‌: హిమాచల్‌ ప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా నియమితులైన రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్‌ నాయకులు, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. మంగళవారమే ఆయన కుటుంబ సమేతంగా సిమ్లాకు బయల్దేరి వెళ్లారు. అంతకు ముందు ఆయనను గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర రాజ్‌భవన్‌ ఐపీఎస్‌ ఏడీసీ మోహిత్‌ చావ్లా దత్తాత్రేయ నివాసానికి వచ్చి అందజేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు సిమ్లాలోని రాజ్‌భవన్‌లో ఆరాష్ట్ర హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ దత్తాత్రేయతో గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర సీఎం జైరాం ఠాకూర్‌తో పాటు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావులతో పాటు పార్టీ ముఖ్య నాయకులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు హాజరవుతున్నారు. 

మరిన్ని వార్తలు