బెంగళూరుగా మారిన బెంగళూర్

1 Nov, 2014 16:15 IST|Sakshi
బెంగళూరుగా మారిన బెంగళూర్

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూర్ పేరులో స్వల్ప మార్పులు చేశారు. కన్నడ బాష ప్రకారం రాజధానిని బెంగళూరుగా మార్చారు. శనివారం కర్ణాటక రాష్ట్రం 59వ అవతరణ దినోత్సవం సందర్భంగా బెంగళూరుతో పాటు ఆ రాష్ట్రంలోని మరో 11 నగరాల పేర్లను అధికారికంగా మార్చారు.

'కర్ణాటక ప్రభుత్వం కన్నడ బాష ఉచ్ఛరణ ప్రకారం రాజధానితో పాటు మరో 11 నగరాల పేర్లను మార్చాలని నిర్ణయించింది. నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. స్థానిక బాష ప్రకారం పేర్లలో మార్పులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది' అని అధికారి ఒకరు చెప్పారు.

మారిన నగరాల పేర్లు

పాతపేరు-కొత్త పేరు

బెంగళూర్-బెంగళూరు
మైసూర్-మైసూరు
మంగళూర్-మంగళూరు
బెల్గాం-బెలగావి
హుబ్లి-హుబ్బళ్లి
గుల్బర్గా-కలబుర్గి
బీజాపూర్-విజయపుర
చిక్మగళూర్-చిక్కమగళూరు
హోస్పేట్-హోస్పేట
షిమోగా-శివమొగ్గ
టుంకూర్-టుమకూరు
బెళ్లారి-బళ్లారి

మరిన్ని వార్తలు