బార్‌ ఓనర్‌ అతి తెలివి...

8 Apr, 2017 19:15 IST|Sakshi
బార్‌ ఓనర్‌ అతి తెలివి...

ఓ బార్‌ ఓనర్‌ అతి తెలివి ప్రదర్శించాడు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తూచా తప్పకుండా పాటించాడు. ఓ ఐడియాతో తన వైన్‌ షాప్‌ మూత పడకుండా కాపాడుకున్నాడు. దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులకు 300 మీటర్ల దూరంలోపు వైన్‌ షాప్‌లు ఉండాలి అన్న నిబంధను పాటించాడు.

కేరళలోని ఎర్నాకులం జాతీయ రహదారి 17కు ఆనుకుని ఐశ్వర్య పేరుతో ఓ బార్‌ ఉంది. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం 300 మీటర్లలోపు మద్యం షాపులు ఉండకూడదు. అలా ఉంటే మూతేయాల్సిందే. అదే కష్టం ఐశ్వర్య బార్‌కు వచ్చింది. దీంతో బార్‌ మూసేయాల్సిన పరిస్థితి.

కానీ ఆబార్‌ ఓనర్‌ అతి తెలివి ఉపయోగించి తప్పించుకున్నాడు. జాతీయ రహాదారికి 300మీటర్ల దూరంలో ఉన్న షాప్‌ మెయిన్‌గేట్‌ను మూసివేశాడు. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశాడు. దేవస్థానాల్లో దర్శనం కోసం ఏర్పాటు చేసే క్యూ లైన్ల తరహాలో వెనక్కి ముందుకు సుమారు 300 మీటర్లుకు పైగా క్యూలైన్లు ఏర్పాటు చేశాడు. దీంతో కోర్టు నిబంధనలు ఉల్లంఘించకుండా తన బార్‌ మూత పడకుండా కాపాడుకున్నాడు.దీనికోసం సుమారు లక్షన్నర రూపాయలను వదిలించుకోవాల్సి వచ్చింది. ఇదే బాటలో నడవటానికి పలు బార్లు, వైన్‌ షాప్‌ ఓనర్లు సిద్దమౌతున్నారు.

మరిన్ని వార్తలు