గూగుల్‌ క్రోమ్‌ ఇన్‌స్టాల్‌ చేసుకునేటప్పుడు జాగ్రత్త

1 Jul, 2020 14:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  గూగుల్‌ క్రోమ్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని  ది కంప్యూటర్‌ ఎమర్జన్సీ రెస్పాన్స్‌ టీం ఆఫ్‌ ఇండియా (సీఈఆర్‌టీ-ఇన్‌) వినియోగదారులను హెచ్చరించింది. యూజర్ల డేటాను సేకరిస్తున్నారని తెలిసిన తరువాత 100 హానికరమైన గూగుల్‌ ఎక్స్‌టెన్షన్లను తొలగించినట్లు తెలిపింది. గూగుల్ క్రోమ్ వెబ్ స్టోర్ సెక్యూరిటీని స్కాన్‌ చేయడానికి ఈ ఎక్స్‌టెన్షన్స్‌లో కోడ్ ఉన్నట్లు కనుగొన్నట్లు కూడా సీఈఆర్‌టీ-ఇన్ తెలిపింది. (సైబర్‌ యుగంలో స్వాహాల పర్వం )

ఈ ఎక్స్‌టెన్షన్స్‌ స్క్రీన్‌షాట్‌లను తీయడం, క్లిప్‌బోర్డ్ చదవడం, పాస్‌వార్డులు తెలుసుకోవడం, రహస్య సమాచారాన్ని తెలుసుకుంటున్నాయని  కూడా  ఈ ఏజన్సీ తెలిపింది. దీనిని దృష్టిలో ఉంచుకొని వినియోగదారులు కచ్చితంగా అవసరమైన ఎక్స్‌టెన్షన్స్‌ మాత్రమే ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి అని, అలా చేయడానికి ముందు వినిమోగదారుల రివ్యూలను తెలుసుకోవాలని సూచించింది. ఈ ఏడాది జనవరిలో,  సైబర్‌ క్రైమ్‌ నేరాల సంఖ్య గణనీయంగా పెరిగిన నేపథ్యంలో గూగుల్ అన్ని కమర్షియల్‌  ఎక్స్‌టెన్షన్స్‌ను నిలిపివేసింది. గూగుల్‌ క్రోమ్‌ స్టోర్‌ను ఉపయోగించుకొని చాలా కాలంగా సైబర్‌ నేరగాళ్లు వివిధ రకాలుగా వినియోగదారులను మోసం చేస్తున్నారు. సీఈఆర్‌టీ-ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్‌  టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. ఇది సైబర్ భద్రతకు సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటుంది. (భార‌త్‌పై సైబ‌ర్ దాడుల‌కు పాల్ప‌డ్డ చైనా)

మరిన్ని వార్తలు