పుదుచ్చేరిలో బేడీ వర్సెస్‌ స్వామి

6 Jan, 2017 02:46 IST|Sakshi

పుదుచ్చేరి/న్యూఢిల్లీ: పుదుచ్చేరిలో సోషల్‌ మీడియా వాడకంపై  అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వం, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ల మధ్య వివాదం మరింత ముదిరింది. అధికారిక సమాచారం కోసం సోషల్‌ మీడియా వాడటాన్ని నిషేధిస్తూ సీఎం నారాయణ స్వామి తీసుకున్న నిర్ణయాన్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ రద్దు చేశారు. కొద్ది రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్న బేడీ.. తన ఆదేశాల కాపీని గురువారం ట్వీటర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు చెల్లవని, మార్గదర్శకాలకు అవి విరుద్ధంగా ఉన్నాయన్నారు.

అభివృద్ధి దిశగా పుదుచ్చేరి పయనించాలంటే సమాచార రంగంలో తిరోగమనం సరికాదని, అందువల్లే ప్రభుత్వ ఉత్తర్వులు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. అధికారిక సమాచారం కోసం వా ట్సప్‌ వాడుకోవాలంటూ ఇటీవలే బేడీ అధికారులకు సూచించారు. అనంతరం సోషల్‌ మీడియా ద్వారా సమాచారం పంపడాన్ని రద్దు చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు.

>
మరిన్ని వార్తలు