పెరుగుతున్న జకీర్ తల వెల

14 Jul, 2016 11:53 IST|Sakshi
పెరుగుతున్న జకీర్ తల వెల

న్యూఢిల్లీ: వివాదాస్పద ఇస్లాం బోధకుడు జకీర్ నాయక్ తలకు వెల పెరుగుతూ వస్తోంది. షియా వర్గానికి చెందిన హుస్సేనీ టైగర్స్ మంగళవారం జకీర్ పై రూ.15 లక్షల రివార్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా.. వివాదాస్పద హిందూ నేత సాధ్వి ప్రాచీ.. జకీర్ ను హతమార్చిన వారికి రూ.50 లక్షలు ఇస్తానని ప్రకటించారు.

ఉత్తరాఖండ్ లోని రూర్కీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రాచీ ఈ వ్యాఖ్యలు చేశారు. జకీర్ ఇస్లాం బోధకుడు కాదని ఉగ్రవాది అంటూ ధ్వజమెత్తారు. ఈ రివార్డును తాను వ్యక్తిగతంగా ప్రకటిస్తున్నానని తెలిపారు. మదర్సాల్లో పని చేస్తున్న ఇటువంటి బోధకులపై  విచారణ జరిపించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు.
 
కాగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని రెస్టారెంట్ లో అతి కిరాతకంగా 22 మందిని చంపిన ఉగ్రవాదులు జకీర్ బోధనలతో ప్రభావితమయ్యాని ఆదేశ పోలీసు వర్గాలు నిర్ధారించిన విషయం తెలిసిందే. జకీర్ పై మహారాష్ట్ర ప్రభుత్వం సైతం విచారణకు ఆదేశించింది.
 

మరిన్ని వార్తలు