బెంగాల్‌ వ్యాప్తంగా నిలిచిపోనున్న వైద్య సేవలు

12 Jun, 2019 11:53 IST|Sakshi

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో జూనియర్‌ డాక్టర్ల సమ్మె తారాస్థాయికి చేరుకుంది. నేడు సీనియర్‌ డాక్టర్లు కూడా వీరికి మద్దతు తెలపడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. కోల్‌కతా ప్రభుత్వాస్పత్రిలో చోటు చేసుకున్న ఓ వివాదం మూలాన జూనియర్‌ డాక్టర్లు మంగళవారం నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం వల్ల ఓ వ్యక్తి చనిపోయాడు. కానీ వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడంటూ మృతుడి కుటుంబ సభ్యులు వైద్యుల మీద దాడి చేశారు. ఆగ్రహించిన జూనియర్‌ డాక్టర్లు తమకు రక్షణ కల్పించాలంటూ సమ్మెకు పిలుపునిచ్చారు.

ఫలితంగా ప్రభుత్వాసుపత్రుల్లో ఔట్‌ పెషేంట్‌ విభాగం సేవలను ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు నిలిపివేశారు. అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపారు. కానీ వైద్యులు తక్కువగా ఉండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనే అవకాశం ఉంది. ప్రైవేట్‌ ఆప్పత్రులు కూడా డాక్టర్ల సమ్మెకు మద్దతు తెలిపారు. ప్రభుత్వం జూనియర్‌ డాక్టర్లకు రక్షణ కల్పించే విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికి వైద్యులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

మరిన్ని వార్తలు