మనుషుల అక్రమ రవాణాలో బెంగాల్‌ టాప్‌

27 Mar, 2017 03:38 IST|Sakshi
మనుషుల అక్రమ రవాణాలో బెంగాల్‌ టాప్‌

ఏపీలో 239, తెలంగాణలో 229 కేసుల నమోదు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మనుషుల అక్రమ రవాణాలో పశ్చిమ బెంగాల్‌ 3,576, రాజస్తాన్‌ 1,422 కేసులతో తొలి రెండు స్థానాల్లో నిలిచినట్లు కేంద్రం తెలిపింది. మొత్తం అక్రమ రవాణా  కేసుల్లో  61 శాతం వాటా ఈ రెండు రాష్ట్రాలదేనని తేల్చిచెప్పింది. కేంద్రం విడుదల చేసిన 2016 గణాంకాల ప్రకారం గుజరాత్‌ 548 కేసులతో మూడోస్థానంలో, మహారాష్ట్ర 517 కేసులతో నాలుగోస్థానంలో ఉన్నాయి. దక్షిణాదిలో 434 కేసులతో తమిళనాడు, 404 కేసులతో కర్ణాటక తొలి రెండుస్థానాల్లో ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో 239, తెలంగాణలో 229 అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. కేంద్ర పాలిత ప్రాంతాల్లో నమోదైన 75 కేసుల్లో 66 కేసులు ఒక్క ఢిల్లీలోనే నమోదయ్యాయి ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం 91 అక్రమ రవాణా కేసులతో అగ్రస్థానంలో ఉంది. జమ్మూకశ్మీర్, త్రిపుర, నాగాలాండ్, దాద్రానగర్‌ హవేలీ, లక్షద్వీప్, పుదుచ్చేరిలలో ఒక్క అక్రమరవాణా కేసు కూడా నమోదుకాలేదు.  అక్రమ రవాణాను అరికట్టడానికి బంగ్లాదేశ్,  యూఏఈలతో అవగాహనా ఒప్పందాల్ని కుదుర్చుకున్నట్లు కేంద్రం తెలిపింది.

>
మరిన్ని వార్తలు