భారీ కుంభకోణంలో సూపర్‌స్టార్‌కు నోటీసులు

9 Jul, 2019 15:55 IST|Sakshi

బెంగాల్‌ సూపర్‌ స్టార్ ప్రసేన్‌జిత్‌ ఛటర్జీకి ఈడీ నోటీసులు

రోస్‌వ్యాలీ కుంభకోణంలో హస్తం ఉందంటూ ఆరోపణ

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ ప్రకంపనలకు వేదికైన రోజ్‌ వ్యాలీ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరో కీలక ముందడుగు వేసింది. ఈ స్కాంలో ప్రముఖ నటుడు, బెంగాల్‌ సూపర్‌ స్టార్ ప్రసేన్‌జిత్‌ ఛటర్జీకి హస్తం ఉందంటూ.. మంగళవారం సమన్లు జారీచేసింది. రోస్‌వ్యాలీ కంపెనీ నేతృత్వంలో 2010-12 మధ్య కాలంలో పలు సినిమాలను నిర్మించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వారితో ఛటర్జీ భారీ మొత్తంలో నగదు లావాదేవీలు జరిపారని ఈడీ పేర్కొంది. దీనిపై జూలై 19లోగా తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ పరిణామం బెంగాల్‌ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

బెంగాల్‌లో సంచలనంగా మారిన రోజ్‌వ్యాలీ స్కాంలో ఇప్పటికే అనేక రాజకీయ, సినీ ప్రముఖులను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ముందు కూడా రోజ్‌వ్యాలీ కుంభకోణం పెద్ద దుమారమే చెలరేగింది. శారదా, రోజ్‌వ్యాలీ కుంభకోణాల కేసుల్ని విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తున్న రాజీవ్‌కుమార్‌ను సీబీఐ అరెస్ట్‌ చేసింది. బెంగాల్‌ ప్రముఖ నిర్మాత శ్రీకాంత్‌ మోహతా కూడా ఈ స్కాంలో ఉన్నారని.. రూ. 25కోట్లు  తీసుకున్న ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జాధవ్‌ కేసు: కేవలం ఒక్క రూపాయే ఛార్జ్‌

ఈనాటి ముఖ్యాంశాలు

రైల్వే అధికారుల పూజలు; విమర్శలు!

నాడు చంద్రుడి యాత్ర విఫలమైతే..

మద్యం ఆపై గన్స్‌తో డ్యాన్స్‌ : ఎమ్మెల్యేపై వేటు

ఫ్రెండ్స్‌తో పార్టీ.. రూ. 5 వేల కోసం..

ఆస్తి వివాదం : 9 మంది మృతి

సూర్య వ్యాఖ్యలను సమర్థించిన కమల్‌

అది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది : అమిత్‌ షా

50 శాతం సీట్లు ఇస్తేనే పొత్తు..

మూక హత్యలపై కేంద్రం రియాక్షన్‌ ఇదే..

ఒట్టేసి చెబుతున్నాం.. మీకు అన్నీ ఫ్రీ!

నడిరోడ్డుపై అంకుల్‌ బిత్తిరి చర్య

ఒక్క ప్రేమ కోసమే సాక్షి మిశ్రా పారిపోలేదు!

కర్ణాటక రాజకీయాలపై కాంగ్రెస్‌ ఆసక్తికర ట్వీట్‌

ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాలపై ఆరా తీయండి

సంకీర్ణ ప్రభుత్వానికి ఇక కష్టమే!

భారత్‌కు దావూద్‌ కీలక అనుచరుడు!

కన్నడ సంక్షోభంపై సుప్రీం కీలక తీర్పు

నగ్నంగా ఉంటే నయమవుతుంది!

తప్పతాగి.. పోలీసుపై మహిళ వీరంగం!

కులాంతర వివాహమా? మొబైల్‌ వాడుతున్నారా?

వరద బీభత్సం.. 50 మంది మృతి..!

ప్రధాని లక్ష్యంగా దాడికి కుట్ర!

టీనేజ్‌ అమ్మాయి మొబైల్‌ వాడితే జరిమానా..!

అనారోగ్యం అతడి పాలిట వరమైంది

ప్రాంతీయ భాషల్లో మళ్లీ ‘పోస్ట్‌మెన్‌’ పరీక్ష

కోడలికి కొత్త జీవితం

ఎంపీలకు ఢిల్లీ తెలుగు అకాడమీ సన్మానం

మంత్రుల డుమ్మాపై మోదీ ఫైర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అలా 26 కిలోల బరువు తగ్గాను’

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!