బెంగాలీ నటి సుప్రియా దేవి కన్నుమూత

27 Jan, 2018 03:35 IST|Sakshi
బెంగాలీ నటి సుప్రియా దేవి

కోల్‌కతా: బెంగాలీ ప్రముఖ నటి సుప్రియా దేవి(85) కన్నుమూశారు. గుండెపోటుతో ఆమె శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రిత్విక్‌ ఘటక్‌ దర్శకత్వం వహించిన ‘మేఘే ఢాకా తారా’ చిత్రంలో నీతా అనే పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చింది. 1933లో మిచ్‌కినాలో జన్మించిన సుప్రియా దేవి 1952లో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 

55 ఏళ్లు ఎన్నో చిత్రాల్లో నటించారు. అందులో చౌరింగీ, బాగ్‌ బందీ ఖేలా, సన్యాసి రాజ్, దేబ్‌దాస్‌ లాంటి క్లాసిక్‌ చిత్రాలున్నాయి. 2007లో విడుదలైన నేమ్‌సేక్‌ చిత్రంలో చివరిసారి నటించారు.  దేవికి పద్మశ్రీ అవార్డుతో పాటు బెంగాల్‌ ప్రభుత్వ పౌర పురస్కారం బంగా విభూషణ్‌ లభించాయి. శుక్రవారమే అధికారిక లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.  

మరిన్ని వార్తలు