అమూల్యకు బెయిల్ మంజూరు

12 Jun, 2020 20:57 IST|Sakshi

బెంగ‌ళూరు: "పాకిస్తాన్ జిందాబాద్" అంటూ దేశ వ్య‌తిరేక నినాదాలు చేసిన యువ‌తి అమూల్య లియోనాకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మూడు నెల‌ల పాటు జైలు జీవితం త‌ర్వాత ఆమె బెయిల్‌పై విడుద‌ల కానుంది. కాగా గురువారం నాటి విచార‌ణ‌లో బెంగ‌ళూరు కోర్టు ఆమె బెయిల్ అభ్య‌ర్థ‌న‌ను తోసిపుచ్చిన విష‌యం తెలిసిందే. బెయిల్ మంజూరు చేస్తే ఆమె పారిపోవ‌డంతో పాటు మ‌రోసారి ఇదే తరహా నేరాలకు పాల్పడే అవకాశముంద‌ని అభిప్రాయ‌ప‌డింది. (ఆమె నోట పాక్‌ పాట)

ఫిబ్ర‌వ‌రి 20న బెంగ‌ళూరులో పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా చేప‌ట్టిన ర్యాలీలో పాల్గొంది. ఇందులో ఏఐఎమ్ఐఎమ్ అధ్య‌క్షుడు అస‌దుద్ఈన్ ఓవైజీ కూడా పాల్గొనగా.. అత‌ని సమక్షంలోనే 'పాకిస్తాన్ జిందాబాద్' అంటూ నినదించింది. దీంతో అమూల్య వ్యాఖ్యలపై నిరసనగా ప‌లు చోట్ల ఆందోళ‌నలు జ‌రిగాయి. దేశ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల కింద బెంగ‌ళూరు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. (ఆ విద్యార్ధిని బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత..)

మరిన్ని వార్తలు