ఆన్‌లైన్‌తో ఆటలొద్దు.. అవి అప్‌లోడ్‌ చేయొద్దు

26 May, 2020 08:00 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బెంగళూరు : అనవసరంగా మీ ఆడపిల్లల ఫోటోలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయరాదు. దీనివల్ల మీకు అవమానాలు తప్పవు అని నగర పోలీస్‌ కమిషనర్‌ భాస్కర్‌రావ్‌ ప్రజలను హెచ్చరించారు. సోమవారం నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. లాక్‌డౌన్‌ సమయంలో సైబర్‌ నేరాలు పెచ్చు మీరుతున్నాయి. కొందరుఇంట్లో కూర్చుని అకృత్యాలకి పాల్పడుతున్నారు. ఆన్‌లైన్‌లో పాఠాల పేరుతో అశ్లీల ఫోటోలు, వీడియోలు తీసుకుని ఇంటర్నెట్లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు అందితే తక్షణం చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. (భాస్కర్‌.. ఏం నడుస్తుంది? :కేసీఆర్‌ )  

ఆ నేరాలు పెరుగుతున్నాయి  
ఇంటర్నెట్‌ అనేది ఇంట్లో ఉన్న కిటికీ, తలుపులు వంటివి. ఇంటిని ఎలా కాపాడుకుంటామో అలాగే ఆన్‌లైన్‌ గురించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  మీ ఇంట్లో అక్కచెల్లెలు, భార్యా పిల్లలు ఫోటోలను దయచేసి ఆన్‌లైన్‌లో పెట్టరాదు. కొందరు మీ కుటుంబసభ్యుల ఫోటోలను అశ్లీలంగా సృష్టించి మిమ్మల్ని భయబ్రాంతులకు గురి చేయవచ్చు. ఇలాంటి ఘటనలు లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లో కూర్చున్న వారితో జరుగుతున్నాయి అని హెచ్చరించారు. (ఒక హత్యను కప్పిపుచ్చేందుకు మరో 9 హత్యలు )

పోలీస్‌ స్టేషన్లలో కరోనా జాగ్రత్తలు  
గత మూడు నెలల నుంచి పోలీసులు కరోనాతో పోరాటం చేస్తున్నామని, మార్చి నుంచి అన్ని పోలీస్‌స్టేషన్లలో మాస్కులు ధరించడం, వేడి నీటితో చేతులు శుభ్రం చేసుకోవాలని హెచ్చరించామన్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి అన్ని చోట్ల వ్యాపించి బలి తీసుకుంటోందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పోలీస్‌స్టేషన్‌ ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడపడితే అక్కడ ఉమ్మరాదని, నిత్యం వేడినీరు తాగాలని సూచించామన్నారు.  కొన్ని పోలీస్‌స్టేషన్లలో వాషింగ్‌మెషిన్లు కూడా పెట్టామని తెలిపారు. కరోనా సోకిన పోలీసుల రక్షణకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు