22 ఏళ్లుగా ఆ ఇంటికి వాటర్‌ బిల్లే లేదు

28 Mar, 2017 10:11 IST|Sakshi
22 ఏళ్లుగా ఆ ఇంటికి వాటర్‌ బిల్లే లేదు

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ సీనియర్‌ శాస్త్రవేత్త గత 22 ఏళ్లుగా నీటి బిల్లు కట్టడం లేదు. ఎందుకంటే ఆయన ఇంటికి అసలు ప్రభుత్వ కుళాయి కనెక్షన్‌ కూడా లేదు. అదేమిటీ బెంగళూరులాంటి నగరంలో అసలు కుళాయి కనెక్షన్‌ లేకుండా ఎలా జీవితాన్ని గడుపుతున్నారని అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే.. ఏఆర్‌ శివకుమార్‌ అనే వ్యక్తి ఓ శాస్త్రవేత్త. అతడు కర్ణాటక స్టేట్‌ కౌన్సిల్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో సీనియర్‌ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఆయన తన నివాసాన్ని హరిత గృహంగా నిర్మించారు. రోజుకు కనీసం 400 లీటర్ల వర్షపు నీటిని స్టోర్‌ చేసేలా కట్టుకున్నారు.

ఈ విధంగా నీటి కష్టాలు మొత్తం రాష్ట్రం మొత్తం ఎదుర్కొంటున్నా తన ఇంట్లో మాత్రం ఎలాంటి సమస్య లేకుండా హాయిగా గడిపేస్తున్నారు. మొత్తం మీద ఆయన ఇంటికి దాదాపు 45వేల లీటర్ల నీటిని నిలువ చేసుకునే సామర్థ్యం ఉంది. శక్తివనరులు, వర్షపు నీటిని తిరిగి వినయోగించుకుకోవడం ఎలా అనే విభాగంలో పని చేస్తున్న ఆయన తన ఇంటికి ఏడాదికి మొత్తం 2.3లక్షల లీటర్ల నీరు సరిపోతుందని చెప్పారు. రోజుకు 400 లీటర్ల చొప్పున అవసరం అవుతుందని, 100 రోజులకు 40000 లీటర్ల నీరు అవసరం ఉంటుందని, కానీ తమకు 45వేల లీటర్ల నిలువ నీటి సామర్థ్యం ఉందని అన్నారు.

మరిన్ని వార్తలు