పబ్‌ల మూసివేతకు ఆదేశాలు..

12 Jun, 2018 12:41 IST|Sakshi

సాక్షి, బెంగళూర్‌ : లైసెన్స్‌ లేకుండా మ్యూజిక్‌ ప్లే చేస్తున్న 27 పబ్‌లపై బెంగళూర్‌ పోలీసులు కొరడా ఝళిపించారు. పబ్‌లు, రెస్టారెంట్లలో లైవ్‌ మ్యూజిక్‌ ప్రదర్శించాలంటే అనుమతి తప్పనిసరి అని కర్ణాటక హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు సమర్థించిన నేపథ్యంలో 27 పబ్‌లను మూసివేయాల్సిందిగా బెంగళూర్‌ పోలీసులు ఆదేశించారు. అయితే లైవ్‌ మ్యూజిక్‌ లేకుండా కార్యకలాపాలు సాగించేందుకు ఈ పబ్‌లను అనుమతించారు. సంగీత కార్యక్రమాలు నిర్వహించేందుకు పబ్‌ యాజమాన్యాలు లైసెన్సు కోసం దరఖాస్తు చేయకపోవడంతో వీటిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.

సెక్షన్‌ 294 కింద వీటిని మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేయగా, మరికొన్ని పబ్‌లకు లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలని నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఇదేతరహాలో గత నెలలో ఢిల్లీ ప్రభుత్వం రెస్టో బార్‌లను తమ ప్రాంగణాల్లో రికార్డింగ్‌ డ్యాన్స్‌లు, మ్యూజిక్‌ కాన్సర్ట్‌లు నిర్వహించడంపై హెచ్చరికలు జారీ చేసింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు చేపడతామని ఢిల్లీ ప్రభుత్వం రెస్టో బార్‌ యాజమాన్యాలను హెచ్చరించింది.

మరిన్ని వార్తలు