‘ప్రయాణికురాలిపై ఓలా డ్రైవర్‌ వేధింపులు’

25 Apr, 2019 20:35 IST|Sakshi

బెంగళూరు : ఇంటికి వేళ్లేందుకు క్యాబ్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణికురాలిపై దురుసుగా ప్రవర్తించాడో ఓలా క్యాబ్‌ డ్రైవర్‌. డబ్బుల విషయంలో గొడవపడి ఆమెతో అసభ్యకరంగా మాట్లాడుతూ.. బెదిరింపుల దిగాడు. ఎక‍్కడ ఉంటావో తెలుసు.. గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికేస్తా... నిన్ను అమ్మెస్తా..  నీ సంగతి చూస్తా అంటూ బెదిరించాడు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో అతన్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆర్జిత ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. వీకెండ్‌ జాలీగా గడుపుదామని కోరామంగలాలో సోదరి ఇంటికి వెళ్లారు. గత సోమవారం తిరిగి ఇంటికి వచ్చేందుకై ఆమె నాన్న ఓలా యాప్‌ ద్వారా షేర్‌ క్యాబ్‌ బుక్‌ చేశాడు. గత సోమవారం ఉయదం 9 గంటల ప్రాంతంలో ఆమె క్యాబ్‌ డ్రైవర్‌కు పోన్‌ చేశారు. అతను రాగానే తోటి ప్రయాణికులతో కలిసి కారు ఎక్కారు.

మార్గమధ్యలో అందరు దిగిపోయారు. ఆమె చేరాల్సిన ప్రదేశం వచ్చింది. ఆమె క్యాబ్‌ దిగగానే రూ. 200 ఇవ్వమని అడిగాడు. తన తండ్రి ఓలా మనీ ద్వారా రూ. 70 పే చేశాడని, మిగిలిన డబ్బులు మాత్రమే ఇస్తానని చెప్పింది. దీంతో క్యాబ్‌ డ్రైవర్‌ ఆమెపై మండిపడ్డాడు. అసభ్య పదజాలంతో తిట్టసాగాడు. దీంతో ఆర్జిత వాళ్ల నాన్నకు ఫోన్‌ చేసి డ్రైవర్‌తో మాట్లాడమని చెప్పింది. అతను ఫోన్‌ లాక్కొని అతన్ని బెదిరించాడు. ‘ మీ కూతురిని చంపేస్తా. గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికేస్తా. మర్యాదగా డబ్బులు ఇవ్వమని చెప్పు’ అని హెచ్చరించాడు. అనంతరం ఆర్జితకు ఫోన్‌ ఇ‍వ్వకుండా ఆమెతో దురుసుగా ప్రవర్తించాడు. నువ్వు ఎక్కడ ఉంటావో తెలుసు. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తా అని బెదిరించాడు. చివరకు రూ.500 ఇచ్చి ఆర్జిత తన ఫోన్‌ను తీసుకుంది. అనంతరం సాయంత్రం తండ్రితో కలిసి బనస్వాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్‌ను అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు