29 మందికి ‘ఇస్కా’ పురస్కారాలు

8 Jan, 2017 04:56 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతిలో జరుగుతున్న 104వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సదస్సులో భాగంగా 16 మంది శాస్త్రవేత్తలను ఇస్కా 2016–17 బెస్ట్‌ పోస్టర్‌ అవార్డులకు ఎంపిక చేశారు. మరో 13 మందికి ఇస్కా యంగ్‌ సైంటిస్ట్‌ పురస్కారాలను ప్రకటించారు. కెమికల్‌ సైన్సెస్‌లో ఏపీకి చెందిన ప్రదీప్‌కుమార్‌ బ్రాహ్మణ్‌ బెస్ట్‌ పోస్టర్‌ అవార్డును గెలుచుకున్నారు.

బెస్ట్‌ పోస్టర్‌ అవార్డులు..
పశువైద్య, మత్స్య శాస్త్ర రంగంలో లక్నో వర్సిటీకి చెందిన యషికా అవస్థి, జలగావ్‌లోని నార్త్‌ యూనివర్సిటీకి చెందిన యోగితా వై ఫలక్‌... ఆంత్రోపాలజీ, సైకాలజీ విద్యారంగంలో ఢిల్లీ వర్సిటీకి చెందిన సంగీత దే, కోల్‌కతా వర్సిటీకి చెందిన నందినీ గంగూలీ అవార్డులు అందుకున్నారు. కెమికల్‌ సైన్సెస్‌లో కురుక్షేత్ర యూనివర్సిటీకి చెందిన ఆర్తి దలాల్, ఏపీలోని కేఎల్‌ వర్సిటీకి చెందిన ప్రదీప్‌కుమార్‌ బ్రాహ్మణ్‌... ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ సైన్సెస్‌లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(వారణాశి)కి చెందిన మయాంక్‌ అగర్వాల్, మైసూర్‌కు చెందిన అజిత్‌ కె.అబ్రహం తదితరులు అవార్డులు అందుకున్నారు.

యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డులు వీరికే...: అగ్రికల్చర్‌ అండ్‌ ఫారెస్ట్‌ సైన్సెస్‌లో బప్పా దాస్‌(గోవా), వెటర్నరీ అండ్‌ ఫిషరీస్‌ సైన్సెస్‌లో జీబీ శ్రీకాంత్‌(గోవా), ఆంత్రోపాలజీలో నివేదితా సోమ్‌(కోల్‌కతా), కెమికల్‌ సైన్సెస్‌లో సత్యాబడి మోర్తా(భువనేశ్వర్‌), ఎర్త్‌ సిస్టమ్‌ సైన్సెస్‌లో గోవాకు చెందిన షీతల్‌ పీ గోదాడ్, ఇంజనీరింగ్‌ సైన్స్‌లో ఖరగ్‌పూర్‌ యూనివర్సిటీకి చెందిన నందిన బండారు, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌లో ప్రవీణ్‌ ధ్యాని, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ విభాగంలో కోల్‌కతా యూనివర్సిటీకి చెందిన అభిరూప్‌ బెనర్జీ అవార్డులు అందుకున్నారు. అలాగే మెటీరియల్స్‌ సైన్స్‌లో అంజిలీనా కోర్కెటా(కాన్పూర్‌), మెడికల్‌ సైన్స్‌లో సభ్యసాచి దాస్‌(మెడినిపూర్‌), న్యూ బయాలజీలో బోధిసత్వ సాహ(కోలకతా), ఫిజికల్‌ సైన్స్‌లో ధర్మేంద్ర పతాప్‌ సింగ్‌(లక్నో), ప్లాంట్‌ సైన్స్‌లో నేహా పాండే(లక్నో)లు అవార్డులు అందుకున్నట్లు ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ అసోసియేషన్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు