పన్ను ఎగవేతదారుల ఫోన్లు ఇకపై ట్యాప్!

30 May, 2016 09:20 IST|Sakshi

న్యూఢిల్లీ: పన్ను ఎగవేతదారుల ఆట కట్టించడానికి ఆదాయపు పన్ను శాఖ కొత్త కొత్త దారులు వెతుకుతోంది. తరచూ విదేశాలకు వెళ్లే వారి ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్లపై దృష్టి పెట్టే యోచనలో ఉన్న శాఖ అధికారులు.. తాజాగా వ్యక్తుల ఫోన్లను ట్యాంపింగ్ చేసే యోచనను హోం మంత్రిత్వశాఖ అధికారుల ముందుంచారు. ఫోన్ ను ట్యాప్ చేస్తే కాల్ రికార్డుల ఆధారాలు దొరుకాతాయని, అప్పుడు నిందితులు తప్పించుకోలేరని ఓ సీనియర్ ఐటీ అధికారి అన్నారు.

నల్లధనాన్ని అంతమొందించడం తమ లక్ష్యమని ఎన్డీయే సర్కారు ప్రకటించడంతో ఈ ఆలోచనకు ఆమోదముద్ర పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2014-2015, 2015-2016 మధ్య కాలంలో ఐటీ దాడులు నిర్వహించి సరిగ్గా లెక్కలు లేనివారిని ఈ జూన్ 1 తర్వాత ఆదాయమార్గాలను చూపాలని ఆదేశించింది. ఈ లెక్కలకు సంబంధించిన డాక్యుమెంట్లను ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) సింగిల్ విండో విధానంలో పరిశీలించనుంది. ప్రస్తుతం ఫ్రాన్స్ లోని హెచ్ఎస్ బీసీ బ్యాంక్ లో 398 కేసులకు, పనామా పేపర్ల నుంచి 53 కేసులకు సంబంధించిన లీకులు ప్రభుత్వం వద్ద ఉన్నట్లు రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ ముఖ్ ఆధియా తెలిపారు.

మరిన్ని వార్తలు