'లలిత్గేట్'తో కాంగ్రెస్ లో ముసలం

2 Jul, 2015 14:00 IST|Sakshi
'లలిత్గేట్'తో కాంగ్రెస్ లో ముసలం

బెంగళూరు: లలిత్గేట్ వివాదంలో బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్కు లేదని కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి, కర్ణాటక మాజీ గవర్నర్ హన్స్ రాజ్ భరద్వాజ్ విమర్శించారు. కాంగ్రెస్ నాయకుడైన ఆయన సొంత పార్టీపైనే విమర్శలు గుప్పించారు. ప్రధానంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీతో పాటు సీనియర్ నాయకులపైనా ధ్వజమెత్తారు. పార్టీపై పట్టులేని రాహుల్ వాస్తవాలను అర్థంచేసుకునే స్థితిలో లేరని వ్యాఖ్యానించారు. లలిత్ మోదీ వివాదంలోచిక్కుకున్న వసుంధరా రాజే, సుష్మస్వరాజ్ల రాజీనామాల కోసం పట్టుబట్టలేకపోతున్నారని మండిపడ్డారు.

రాబోయే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసే స్థితిలో కాంగ్రెస్ నేతలున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకత్వానికి నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని నిలదీసే సత్తా ఉందా అని భరద్వాజ్  సవాల్ చేశారు. 'లలిత్గేట్'తో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనూ ముసలం మొదలైందని భరద్వాజ్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, సుష్మ, రాజె రాజీనామా చేయాలని పి. చిదంబరం,  జైరాం రమేష్, గులాం నబీ ఆజాద్ తదితర సీనియర్ నాయకులు గట్టిగానే పట్టుబడుతున్నారు.

మరిన్ని వార్తలు