తొలి మహిళా యుద్ధ పైలట్‌గా భావన

23 May, 2019 03:57 IST|Sakshi
భావనా కంఠ్‌

న్యూఢిల్లీ: భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌)లో విమానం ద్వారా యుద్ధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అర్హత సాధించిన తొలి మహిళగా భావనా కంఠ్‌ బుధవారం చరిత్ర సృష్టించారు. మిగ్‌–21 బైసన్‌ విమానంపై పగటిపూట యుద్ధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉద్దేశించిన సిలబస్‌ను భావన పూర్తి చేశారని వాయుసేన అధికార ప్రతినిధి గ్రూప్‌ కెప్టెన్‌ అనుపమ్‌ బెనర్జీ చెప్పారు. ప్రస్తుతం రాజస్తాన్‌లోని బికనీర్‌లోని వైమానిక స్థావరంలో భావన విధులు నిర్వర్తిస్తున్నారు. 2017 నవంబర్‌లో ఫైటర్‌ స్క్వాడ్రన్‌లో చేరిన భావన, గతేడాది మార్చిలో తొలిసారిగా సొంతంగా మిగ్‌–21 బైసన్‌ యుద్ధ విమానాన్ని నడిపారు. యుద్ధ విమానాలను నడిపేందుకు మహిళలకూ అవకాశమివ్వాలని మోదీ ప్రభుత్వం తొలి నాళ్లలో నిర్ణయం తీసుకుంది.

మరిన్ని వార్తలు