రామమందిరం నిర్మించి తీరుతాం: భయ్యాజీ

11 Mar, 2018 21:22 IST|Sakshi
ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి సురేష్‌ భయ్యాజీ జోషి

సాక్షి, నాగ్‌పూర్‌ : అయోధ్యలో రామమందిర నిర్మాణంపై ఏకాభిప్రాయం సాధించడం కష్టమే అయినా,  అక్కడ మందిరం నిర్మించడం మాత్రం ఖాయమని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) ప్రధాన కార్యదర్శి సురేష్‌ భయ్యాజీ జోషి ఆదివారం స్పష్టం చేశారు. అయోధ్యలో మరే ఇతర కట్టడాన్నీ అనుమతించబోమని పేర్కొన్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టు నుంచి సానుకూల తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాగ్‌పూర్‌ శనివారం జరిగిన సంఘ్‌ సమావేశంలో జోషి ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యదర్శిగా మరో దఫా ఏకగ్రీవంగా ఎన్నికవడం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న సంఘ్‌ ఆఫీస్‌ బేరర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2009 నుంచి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న భయ్యాజీ జోషి తాజా ఎన్నికతో 2021 వరకు పదవిలో ఉంటారు. జోషితోపాటు కర్ణాటక, ఏపీ, తెలంగాణ ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవహారాలను పర్యవేక్షించే నాగరాజ్‌  క్షేత్రీయ సంఘ్‌ సంచాలక్‌గా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయినట్టు సంస్థ ప్రకటించింది. 

మరిన్ని వార్తలు