క్షయని నోటిఫై చేయకుంటే జైలు శిక్ష

23 Mar, 2018 02:22 IST|Sakshi

న్యూఢిల్లీ: క్షయ కేసుల వివరాలను వైద్యులు ఇకపై తప్పనిసరిగా సంబంధిత జిల్లా అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు. ఔషధ విక్రేతలకు కూడా ఇది వర్తిస్తుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ విషయాలతో గెజిట్‌ ప్రకటన జారీచేసింది. వైద్యులు, ఫార్మసీలు తప్పకుండా క్షయ వ్యాధి కేసులను నోటిఫై చేయాలని ఆ నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. జైలుశిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు.

మరిన్ని వార్తలు