నవజాత శిశువు మాయం : రణరంగంగా ఆసుపత్రి

29 Jun, 2019 17:32 IST|Sakshi

సాక్షి, పట్నా: బిహార్‌లో  ఆసుపత్రులలో వరుసగా వివాదాస్పద సంఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇస్లాంపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  నవజాత శిశువు కనిపించకుండా  పోయిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.  నలందాకు చెందిన ఇస్లాంపూర్‌ వాసులు  తమ బంధువును ప్రసవం కోసం ఆసుపత్రికి తీసు కొచ్చారు.  గత రాత్రి ఆ మహిళ  బిడ్డకు జన‍్మనిచ్చింది. అయితే ఆ శిశువు కనిపించకుండా పోవడంతో బంధువులు ఆగ్రహంతో రగిలిపోయారు.  ఒక మహిళ తమ బిడ్డను అపహరించుకుపోయిందని ఆరోపిస్తున్నఆందోళనకు దిగడంతో ఘర్షణకు దారితాసింది.  విచక్షణ ఆసుపత్రిపై రాళ్ల దాడికి దిగారు..  ఆసపత్రి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో  ఆసుపత్రి  పరిసర ప్రాంతం రణరంగంగా మారిపోయింది.

మరిన్ని వార్తలు