పేదల జీవితాలతో ఆడుకుంటే చేతులు నరికేస్తా

19 Oct, 2014 01:33 IST|Sakshi
పేదల జీవితాలతో ఆడుకుంటే చేతులు నరికేస్తా

వైద్యులకు బీహార్ సీఎం మంజీ హెచ్చరిక
 
పాట్నా: ‘పేదల జీవితాలతో ఆడుకునే వైద్యులను ఊరకే విడిచిపెట్టం. జితన్‌రామ్ మంజి వారి చేతులు నరికేస్తాడు’అని బీహార్ ముఖ్యమంత్రి జితన్‌రామ్ మంజి వైద్యులను హెచ్చరించారు. శుక్రవారం తూర్పు చంపారన్ జిల్లాలో ఓ ఆస్పత్రి ప్రారంభం సందర్భంగా నిర్వహించిన సభలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీటిపై ప్రతిపక్షాలు, వైద్యులు మండిపడడంతో శనివారం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. పేదలకు చిత్తశుద్ధితో సేవ చేయని వైద్యులను ఉద్దేశించి తన భావాన్ని వ్యక్తం చేయడానికి ఓ హిందీ సామెతను ఉపయోగించానని, అంతేకానీ నిజంగా చేతులు నరికేస్తానని అనలేదన్నారు.

‘కద్ చోటా కర్ దేంగే(సైజు తగ్గిస్తా)’ లేదా ‘హాత్ కట్ దేంగే(చేతులు నరుకుతా)’ వంటి సామెతలు హిందీలో ఉన్నాయని, వాటినే వాడానని అన్నారు. తనకు వైద్యులపై గౌరవముందని, అయితే 10 శాతం మంది వైద్యులు పేదలను పట్టించుకోవడం లేదని, వారిపైనే అసంతృప్తి వ్యక్తంచేశానని పేర్కొన్నారు.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు