జేడీ(యూ) అధ్యక్షుడిగా నితీశ్కుమార్

10 Apr, 2016 15:29 IST|Sakshi

పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్) జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. శరద్ యాదవ్ స్థానంలో ఆదివారం ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల్లో నితీశ్ మరోసారి జేడీయూను అధికారంలోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల కూటమి ఘనవిజయం సాధించింది. నితీశ్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా జేడీయూ అధ్యక్షుడయ్యారు.
 

మరిన్ని వార్తలు